లేఅవుట్లలో పనులు వేగవంతం చేయండి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: జిల్లాలో గృహనిర్మాణాలకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని ప్రధానంగా లేఅవుట్లలో పనులు వేగవంతం చేయాలని జిల్లాకలెక్టర్ ఎం.హరినారాయణన్ అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీవోలు గహనిర్మాణ సిబ్బంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 65202 గహనిర్మాణాలు జరుగుతున్నాయని, ఇందులో 17100 పూర్తి అయ్యాయని మిగతావి వివిధ దశలో జరుగుతున్నాయని వీటిని వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా వివిధ సచివాలయాలలో తక్కువ నిర్మాణాలు జరుగుతున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లను అందుకు గల కారణాలను అడిగారు. లేఔట్లలో జరుగుతున్న నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఇంటి పట్టాలు ఇచ్చి నిర్మాణాలు చేయిస్తున్నారని దీని మీద ఫోకస్ పెట్టాలని అన్నారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టాయని ఈ సమయంలో నిర్మాణాలు వేగవంతం చేసుకుని వేగంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకుంటే బాగుంటుందని సూచించారు. ఇప్పటివరకు 17100 నిర్మాణాలు పూర్తి అయ్యాయని మిగతా గహ నిర్మాణాలు వేగవంతంగా జరిగేలా చూడాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ 3,500 ఇళ్ల స్థలాలకు సంబంధించి వివిధ రకాల సమస్యలు ఉన్నాయని 50% సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని మిగతా వాటికి ప్రత్యామ్నాయ స్థలం కోసం చూడడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తోపాటు, హౌసింగ్ పీడీ పద్మనాభం లో పాల్గొన్నారు.










