Dec 18,2022 22:04

అవార్డు అందుకుంటున్న చిత్తూరు సిసి టీం

జిల్లా ఐటి కోర్‌ టీమ్‌కి సిసిటిఎన్‌ఎస్‌ అవార్డు
అభినందనలు తెలిపిన ఎస్పీ

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:
ఎన్‌సిఆర్‌బి ఢిల్లీ వారు గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న సిసిటిఎన్‌ఎస్‌ (క్రైం అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌్‌ సిస్టమ్‌) అవార్డును రాష్ట్రాలు యుటిటి సిఫార్సు చేసిన విధంగా 2022లో సిసిటిఎన్‌ టి ఐసిజెఎస్‌ (ఇంటర్‌ ఆపరబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌) అమలులో గణనీయమైన సహకారం అందించి నేరస్తులను పట్టుకోవడానికి కషి చేసినందుకు గాను ప్రతిఏటా వ్యక్తిగత అవార్డును ప్రధానం చేస్తారు. నాలుగవ సమావేశంలో భాగంగా డిసెంబర్‌ 15,16వ తేదీలలో న్యూఢిల్లీలోని ఎన్‌సిఆర్‌బి ప్రధాన కార్యాలయం, మహిపాల్‌పూర్‌లో జరిగిన రెండు రోజుల కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ సిసిటిఎన్‌ఎస్‌/ ఐసిజెఎస్‌లో అవార్డులను అందించారు. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురిని ఈఅవార్డు వరించింది. అందులో మన చిత్తూరు జిల్లా నుండి డిసిఆర్బిలో ఐటీ కోర్‌ టీంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న విజె.భాస్కర్‌కు ఈఅవార్డు లభించింది. సదరు అవార్డును రెండు రోజుల పాటు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భాస్కర్‌కు ఎన్‌సిఆర్‌బి డైరెక్టర్‌, జాయింట్‌ డైరెక్టర్‌, ఇతర ప్రభుత్వ అధికారుల సమక్షంలో అందజేయడం జరిగింది. జిల్లా పోలీసుల స్థాయిని మరింత ఉన్నత శికరానికి చేరడానికి పనిచేసిన భాస్కర్‌ను జిల్లా ఎస్పీ, జిల్లా అడిషనల్‌ ఎస్పీ పి.జగదీష్‌ ఇతర ఉన్నతాధికారులు అభినందించడం జరిగింది.