డీఆర్డీఏకి స్కాచ్ అవార్డులు ప్రదానం న్యూఢిల్లీలో స్కాచ్ అవార్డు అందుకుంటున్న డిఆర్‌డిఎ పిడి తులసి
డీఆర్డీఏకి స్కాచ్ అవార్డులు ప్రదానం
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా గ్రామీణసంస్థ నిర్వహిస్తున్న వివిధ పథకాలకు ప్రతిష్టాత్మమైన రెండు స్కాచ్ సిల్వర్ అవార్డులు దక్కాయి. సోమవారం న్యూఢిల్లీలో ఈఅవార్డులను డీఆర్డీఏ పీడీ తులసి డిపిఎం వెంకటేషులకు స్కాచ్‌ప్రతినిధులు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణాభివద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఆరు అవార్డులు అందగా అందులో చిత్తూరు జిల్లాకే రెండు అవార్డు దక్కడం విశేషం. దేశవ్యాప్తంగా గ్రామీణ అభివద్ధి మహిళా ఆర్థిక స్వాలంబన తదితర కార్యక్రమాలకు సంబంధించి ఈ అవార్డులకు సుమారు 100కు పైగా ప్రాజెక్టు పోటీపడ్డాయి. జిల్లాలో పొదుపు సంఘాలను జిల్లా గ్రామీణ అభివద్ధి సంస్థ నిర్వహిస్తున్న పలు పథకాలను గ్రామీణప్రాంత మహిళలు తెలియజేస్తూ వారిలో ఆర్థిక సామాజిక రంగాలపట్ల చైతన్యాన్ని నింపుతూ, జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలచే నిర్వహించబడుతున్న మహిళా నవోదయం మాసపత్రికకు ఈ అరుదైన పురస్కారం తగ్గింది. డిఆర్‌డిఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉపాధి కల్పనామిషన్ ద్వారా గ్రామీణ యుద్ధయువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వారి భవిష్యత్తుకు పునాది వేస్తున్న స్పీడ్ యాప్ సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ (ఉపాధి కల్పన మిషన్) కూడా ఢిల్లీకి చెందిన స్కాచ్ సంస్థ మరో సిల్వర్ అవార్డును అందజేసింది. చిత్తూరు జిల్లాకు ప్రతిష్టాత్మకమైన రెండు అవార్డులు దక్కడం విశేషం. చిత్తూరు జిల్లా గ్రామీణ అభివద్ధి సంస్థకు ఏకకాలంలో రెండు అవార్డులు రావడం గర్వించదగ్గ విషయమని డిఆర్‌డిఏ పిడి తులసి తెలిపారు. న్యూఢిల్లీలో నిర్వహించిన అవార్డుల ప్రధాన ఉత్సవంలో జేడీఎం సరితారెడ్డి, జిల్లాలా ప్రాజెక్టు మేనేజర్ వెంకటేష్ పాల్గొన్నారు. కలెక్టర్ హరినారాయణన్, సహాయ సహకారాలు డీఆర్డీఏ సిబ్బంది సమిష్టి కషి వల్లనే సాధ్యమైందని ఆమె వివరించారు. దీంతో మరింత బాధ్యత పెరిగిందని జిల్లాకే రెండు అవార్డులు దక్కడం జిల్లా డీఆర్డీఏకి గర్వకారణమని తెలిపారు.










