Dec 19,2022 13:19

ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్: సిఐటియు చిత్తూరు జిల్లా ఎనిమిదవ మహాసభలు సోమవారం స్థానిక రెవిన్యూ భవన్లో ప్రారంభమయ్యాయి. రైల్వే స్టేషన్ నుండి రెవెన్యూ భవన్ వరకు కార్మికుల భారీ ర్యాలీ నిర్వహించారు. మహాసభలకు ముఖ్య అతిథులుగా సిఐటియు రాష్ట్ర నాయకులు కందారపు మురళి, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ పాల్గొన్నారు. నేడు దేశవ్యాప్తంగా కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలని మహాసభ పిలుపునిచ్చింది. స్కీం వర్కర్లతో పాటు అన్ని రకాల కార్మికులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని మహాసభ డిమాండ్ చేసింది. ఎన్నికల సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటి నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మహాసభల్లో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వాడ గంగరాజు, చైతన్య లతోపాటు అంగన్వాడి, ఆశ, సంఘమిత్ర, హమాలి వివిధ రకాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.