Dec 17,2022 14:00

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో, వెదురుకుప్పం మండలం, పచ్ఛికాపల్లంలో ఉన్న డిసిసిబి బ్యాంకులో సహకార బందు డిపాజిట్‌ పథకంతో అధిక వడ్డీ పొందవచ్చునని ఆ బ్యాంక్‌ మేనేజర్‌ పార్వతి తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ... రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్య సంస్థ, సహకార కేంద్ర బ్యాంకు కలిసి ప్రవేశపెట్టిన సహకార బందు పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని, బ్యాంకులో డిపాజిట్లు చేయాలని కోరారు. డిసిసిబి బ్యాంకు ద్వారా 7.25 శాతం వడ్డీ 555 రోజులకే అందిస్తున్నట్లు తెలిపారు. సీనియర్‌ సిటిజనులకు 8 శాతం వడ్డీ అందిస్తున్నట్లు చెప్పారు. సహకార బందు డిపాజిట్‌ లు సేకరణ ఈనెల 16 నుంచి 31 తేదీ వరకే ఉంటుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిపాజిట్లు స్వీకరిస్తున్నట్లు, అందిస్తున్నట్లు తెలిపారు. డిసిసిబి లో పొదుపు చేస్తే ఇతర బ్యాంకుల కన్నా అధిక అధిక వడ్డీ వస్తుందని అన్నారు. మరిన్ని వివరాలకు 9492190718 నంబర్‌ కి ఫోన్‌ చేసి సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.